NTR: ఇబ్రహీంపట్నంలో అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి ఘనంగా నిర్వహించారు. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పొట్టి శ్రీరాములు త్యాగఫలితమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ అని పేర్కొన్నారు. అమరావతిలో ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైజ్’గా 58 అడుగుల కాంస్య విగ్రహాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ఆవిష్కరించనున్నట్లు తెలిపారు.