TG: హైదరాబాద్లో ఆస్తి పన్ను చెల్లింపుదారుల కోసం వన్ టైం సెటిల్మెంట్ (OTS) పథకంపై GHMC కమిషనర్ ఆర్వీ కర్ణన్ గుడ్ న్యూస్ చెప్పారు. ఈ పథకం ద్వారా పాత బకాయిలపై 90 శాతం రాయితీని కల్పిస్తున్నట్లు ప్రకటించారు. వినియోగదారులు కేవలం 10 శాతం వడ్డీతో పాటు అసలు పన్నును చెల్లిస్తే సరిపోతుందని తెలిపారు. మార్చి 31 వరకు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.