కడప: జిల్లాలో పదో తరగతి పరీక్షలు ప్రారంభమైన నేపథ్యంలో జిల్లా SP షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నారు. విద్యార్థులు ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకురాకుండా తనిఖీలు నిర్వహిస్తూ, కేంద్రాల సమీపంలో సెక్షన్ 144 అమలు చేసి ప్రశాంత వాతావరణంలో పరీక్షలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు.