తాజాగా మొదలైన లంక ప్రీమియర్ లీగ్ (LPL) రెండో మ్యాచులోనే వింత ఘటన జరిగింది. గాలె టైటాన్స్, దంబుల్ల ఆరా టీమ్స్ మధ్య జరిగిన హైఓల్టేజ్ మ్యాచ్‌కు ఒక పాము అంతరాయం కలిగించింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ రెండు టీమ్స్ తలపడుతుండగా.. మైదానంలోకి ఒక పాము (Snake) దూసుకొచ్చింది.కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో ఈ ఘటన జరిగింది. ఈ మ్యాచ్ సెకండ్ ఇన్నింగ్స్‌లో గాలె టైటాన్స్ బౌలింగ్ చేస్తుండగా ఇది జరిగింది. ఈ టీం స్టార్ ఆల్‌రౌండర్ షకీబల్ హసన్(Shakibal Hasan) ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ వేయడానికి రెడీ అయ్యాడు.
సరిగ్గా అప్పుడే మైదానంలోకి పాము వచ్చినట్లు స్క్రీన్‌పై చూపించారు. దీంతో కాసేపు మ్యాచ్‌ను నిలిపివేయాల్సి వచ్చింది.ఈ పామును గమనించిన గ్రౌండ్ స్టాఫ్ వెంటనే స్పందించి, దాన్ని పట్టేశారు. అనంతరం స్టేడియం బయటకు దాన్ని తీసుకెళ్లారు. అప్పుడు మళ్లీ మ్యాచ్ తిరిగి ప్రాంభమైంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. టీమిండియా వెటరన్ దినేష్ కార్తీక్ (Dinesh Karthikకూడా మైదానంలోకి పాము రావడంపై ట్వీట్ చేశాడు.మైదానం (Field) లో ఒక్కసారిగా పాము కలకలం చెలరేగింది. దాంతో మ్యాచ్ కు అంతరాయం ఏర్పడింది. బౌండరీ వద్ద పామును చూసిన వారు మైదానం సిబ్బందిని అప్రమత్తం చేయడంతో, వారు వెంటనే స్పందించి ఆ పెద్ద పామును మైదానం బయటికి పంపించివేశారు. అనంతరం, మ్యాచ్ కొనసాగింది.