TG: 23వ బయో ఆసియా సదస్సు ద్వారా రూ.1,700 కోట్ల పెట్టుబడులను ఆకర్షించినట్లు గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రసంగంలో తెలిపారు. GCCలలో 20% ఆతిథ్యం ఇస్తూ HYD గ్లోబల్ టెక్ హబ్‌గా మారిందన్నారు. ప్రపంచ పెట్టుబడులకు గమ్యస్థానంగా తెలంగాణ కొనసాగుతోందన్నారు. ఐటీ ఎగుమతులు రూ.3.13 లక్షల కోట్లకు చేరుకున్నాయని, 9.39 లక్షల ఉద్యోగాలు కల్పిస్తోందని పేర్కొన్నారు.