TG: రంగారెడ్డి(D) మోయినాబాద్ డ్రగ్స్ కేసు రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు బయటకొచ్చాయి. ఫామ్‌హౌజ్‌లో డ్రగ్స్ పార్టీ జరిగిందని, డ్రగ్స్ తీసుకోలేదంటూ బుకాయించే ప్రయత్నం చేసినట్లు పోలీసులు తెలిపారు. చివరికి సిల్వర్ శరత్ డ్రగ్స్ తీసుకున్నట్లు ఒప్పుకున్నాడని, అతన్ని చెక్ చేసినప్పుడు 2 గ్రాముల కొకైన్ బయటపడిందన్నారు. కొకైన్ తానే తెచ్చినట్లు కౌశిక్ ఒప్పుకున్నట్లు తెలిపారు.