NRPT: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ సోమవారం బీజేపీ మరికల్ మండల అధ్యక్షుడు మంగలి వేణుగోపాల్ ఆధ్వర్యంలో తహశీల్దార్ రామ్ కోటికి వినతిపత్రాన్ని సమర్పించారు. జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి వెంటనే అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో రాజేశ్, సురేందర్, రాజు, మోహన్ రెడ్డి, శివకుమార్, వెంకటేశ్, రమేశ్, రవి, నరసింహ పాల్గొన్నారు.