KNR: ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యక్రమంలో భాగంగా గంగాధర గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ పడాల భాగ్య లక్ష్మి ఇవాళ గ్రామ పంచాయతీ సిబ్బందిని సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధిలో సిబ్బంది పాత్ర కీలకమని ఆమె కొనియాడారు. ఎండ, వానను లెక్కచేయకుండా పారిశుధ్య కార్మికులు చేస్తున్న సేవలు వెలకట్టలేనివని, వారిని గౌరవించుకోవడం మన బాధ్యతని పేర్కొన్నారు.