WNP: జిల్లా కేంద్రంలో నిర్మాణం పూర్తయిన నూతన టౌన్ హాల్, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కాంప్లెక్స్‌ను ఇవాళ కలెక్టర్ ఆదర్శ్ సురభి సందర్శించారు. నిరుపయోగంగా ఉన్న ఈ భవనాలను వెంటనే అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో సౌకర్యాలను పరిశీలించి, ప్రజల వినియోగం కోసం తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.