VZM: చీపురుపల్లి మండలం ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం అమరజీవి శ్రీపొట్టి శ్రీరాములు 125వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆ మహనీయుని త్యాగం ఈనాటికీ మనకు స్ఫూర్తి అని తెలిపారు. మహాత్మ గాంధీజీ అడుగుజాడల్లో నడచి దేశ స్వాతంత్ర ఉద్యమంలో పాలుపంచుకున్నారన్నారు. పొట్టి శ్రీరాములు తన జీవితంలో ఎన్నో పోరాటాలు చేశారని గుర్తు చేసుకున్నారు.