WGL: యుద్ధం కారణంగా గ్యాస్ కొరత వస్తుందనే ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారని వరంగల్ సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరించారు. గ్యాస్ కనెక్షన్ KYC అప్డేట్, అత్యవసర బుకింగ్ పేరుతో వాట్సాప్, SMSల ద్వారా నకిలీ లింకులు పంపి డబ్బులు దోచుకుంటున్నారు. అనుమానాస్పద లింకులు క్లిక్ చేయవద్దని, గ్యాస్ సంబంధిత అవసరాలకు ఏజెన్సీలను సంప్రదించాలన్నారు.