AP: రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. దీంతో ఆయా పరీక్ష కేంద్రాల వద్ద సందడి వాతావరణం నెలకొంది. పాఠశాలల సిబ్బంది విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసి లోపలికి అనుమతించారు. ఈ ఏడాది 6,40,916 మంది పరీక్షలు రాయనున్నారు. వీరిలో రెగ్యులర్ అభ్యర్థులు 6,22,074 కాగా, ప్రైవేటు విద్యార్థులు 18,842 మంది ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,415 పరీక్షా కేంద్రాలు ఏర్పాటుచేశారు.