బ్రో మూవీ థియేటర్లో పవన్ ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు. తాజాగా అలంకార్ థియేటర్లో పవన్ ఫ్యాన్స్ బీర్ బాటిళ్లతో వీరంగం సృష్టించారు. దాడులు చేసుకోవడంతో పోలీసులు ఎంటర్ అయ్యారు. పలువురిని అదుపులోకి తీసుకున్నారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan), సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej) కలిసి నటించిన సినిమా బ్రో(Bro). జూలై 28న విడుదలైన ఈ సినిమా భారీ విజయం సాధించింది. అటు పవన్ ఫ్యాన్స్కి, ఇటు ఫ్యామిలీ ఆడియన్స్కి ఈ మూవీ బాగా కనెక్ట్ అయ్యింది. ఇకపోతే విడుదలైన మొదటి రోజే ఎవరూ ఊహించని రేంజ్ లో ప్రపంచవ్యాప్తంగా బ్రో సినిమా ఏకంగా రూ.44 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. సముద్రఖని దర్శకత్వం వహించిన ఈసినిమా అద్భుతంగా ఉందంటూ ఆడియన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇకపోతే పవన్ కళ్యాణ్(Pawan Kalyan) సినిమా అంటే ఆయన ఫ్యాన్స్ ఏ రేంజ్లో సందడి చేస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వారు చేసే హంగామా అంతా ఇంత కాదని చెప్పాలి. థియేటర్స్ వద్ద, థియేటర్స్ లో ఫ్యాన్స్ ఎంతో సందడి చేస్తారు. అయితే కొందరు మాత్రం హద్దుమీరి ప్రవర్తిస్తుంటారు. తాజాగా బ్రో సినిమా రెండో రోజు పవన్ ఫ్యాన్స్ రచ్చ చేశారు. హైదరాబాద్ లంగర్ హౌస్ లోని అలంకార్ థియేటర్లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వీరంగం సృష్టించడం కలకలం రేపింది.
పవన్ ఫ్యాన్స్(Pawan Kalyan Fans) బీర్ బాటిళ్లతో థియేటర్లోకి వచ్చి, మద్యం తాగుతూ సీసాలు పగలకొట్టి హాల్ చల్ చేయడంతో స్థానికులు ఇబ్బందులు పడ్డారు. అనంతరం వారిలో వారు గొడవపడి బీర్ బాటిల్ తో పరస్పరం దాడులు చేసుకున్నారు. వారి గొడవని ఆపడానికి వచ్చిన థియేటర్ సిబ్బందిపై కూడా పవన్ ఫ్యాన్స్ దాడి చేశారు. దీంతో థియేటర్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. మద్యం తాగి థియేటర్లో గొడవ చేసిన ఆ యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈ ఘటన వైరల్ అవుతోంది. ఇలాంటి వాళ్ళ వల్లే పవన్ కి చెడ్డపేరు వస్తోందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.