ADB: ఆదిలాబాద్‌లోని పోలీస్ కాలనీలో సోమవారం పిచ్చికుక్క స్వైరవిహారం చేసింది. డీవీ స్కూల్ సమీపంలో ప్రదీప్ అనే వ్యక్తిపై ఒక్కసారిగా దాడి చేసి కాలుపై తీవ్రంగా కరిచింది. గాయపడిన బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. కాలనీలో కుక్కల బెడద విపరీతంగా పెరిగిందని, బయటకు రావాలంటేనే భయమేస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.