KMM: ఎర్రుపాలెం ప్రజా పాలన -ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఎర్రుపాలెం గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ నండ్రు అశ్వని అధ్యక్షతన మల్టీపర్పస్ వర్కర్లకు ఘన సన్మానం చేశారు. గ్రామ పంచాయతీలను ఆదర్శంగా తీర్చిదిద్దడంలో పంచాయతీ కార్మికుడు ఎంతగానో కృషి చేశారని తెలిపారు. వారిని సత్కరించడం సంతోషకరమని తెలిపారు.