నల్గొండలో జనగణన కోసం అధికారులు సన్నాహాలు వేగవంతం చేస్తున్నారు. 2011 జనగణన ప్రకారం జిల్లాలో మొత్తం జనాభా 34,88,809. పురుషులు 17,58,772, మహిళలు 17,29,037. తాజా గణనలో సుమారు 16,18,416 కుటుంబాల వివరాలు సేకరించడమే లక్ష్యం. గ్రామీణ ప్రాంతాల్లో 8,18,306, పట్టణాల్లో 8,00,110 కుటుంబాల నుంచి సమాచారం నమోదు చేయనున్నారు.