NTR: సీఎం సహాయనిధి పేదలకు ఒక వరమని, అనారోగ్యంతో బాధపడుతున్న పేదలకు ఒక ఆసరాగా ఉంటుందని మండల టీడీపీ అధ్యక్షులు కోగంటి బాబు అన్నారు. కంచికచర్ల(మం) గొట్టుముక్కలలో ఆదివారం సీఎం సహాయ నిధి నుంచి విడుదలైన LOC చెక్కులను లబ్ధిదారులకు ఆయన అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.