TG: హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పాల్గొన్నారు. తమ ప్రభుత్వం మైనార్టీలకు అధిక ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. ‘ఈ ప్రభుత్వం మీది, నేను మీ సోదరుడిని మనమంతా కలిసి రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్దాం’ అని పిలుపునిచ్చారు. అందరి అశీర్వాదం ఈ ప్రభుత్వానికి అవసరమన్నారు.