KDP: ప్రొద్దుటూరు శెనగ కొనుగోలు కేంద్రాల్లో అక్రమ వసూళ్లపై మాజీ MLA రాచమల్లు మండిపడ్డారు. ఒక్కో మూటకు రూ.160లు వసూలు చేస్తున్నారన్నారు. రైతు రమణారెడ్డి నుంచి 133 క్వింటాళ్లకు రూ. 21,280లు వసూలు చేశారన్నారు. ఇంకొక రైతు దగ్గర మూటకు 1,400 గ్రాముల శెనగలు ఎక్కువ తీసుకున్నారన్నారు. కొనుగోలు కేంద్రంలో రూ. 25 కోట్ల మేర అవినీతి జరుగుతోందని ఆరోపించారు.