ELR: ఏలూరులోని శ్రీ సాయీశ్వరి మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో ఆదివారం జరిగిన ‘అక్షర ఆంధ్ర’ తుది పరీక్షలను కలెక్టర్ వెట్రిసెల్వి పర్యవేక్షించారు. ఆమె మాట్లాడుతూ.. జిల్లావ్యాప్తంగా 588 కేంద్రాల్లో 97,200 మంది వయోజన అభ్యాసకులు పరీక్షలకు హాజరయ్యారని తెలిపారు. పరీక్షల నిర్వహణ కోసం 2,117 మంది సిబ్బందిని నియమించామని పేర్కొన్నారు.