కరీంనగర్ రూరల్ మండలం చామనపల్లిలో అన్ని కుల సంఘాల ఆధ్వర్యంలో గ్రామ దేవత పోచమ్మ తల్లికి బోనం చేసి మొక్కులు చెల్లించారు. ఏటా ఉగాది పండగకి ముందు ఇలా గ్రామ దేవతకి బోనం చేయడం అనవాయితీగా చేస్తాం అని గ్రామ ప్రజలు తెలిపారు. శివసత్తుల శివాలు, డీజే పాటలతో ఊరిలో పండగా వాతావరణం ఏర్పడింది.