కృష్ణా: అవనిగడ్డ మండలంలో సోమవారం నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మండల వ్యాప్తంగా ఏర్పాటు చేసిన నాలుగు పరీక్షా కేంద్రాలలో మొత్తం 650 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. పరీక్షలు ప్రశాంతంగా, పకడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు.