NLG: చిట్యాల మున్సిపాలిటీ 5వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి దయ్యాల సమత-శ్రీకాంత్ ఓటమిపాలైనా తన హామీని నిలబెట్టుకొని ఆదర్శంగా నిలిచారు. ఎన్నికల సమయంలో వార్డులోని ప్రతి ఇంటి ఆడబిడ్డ వివాహానికి రూ.10,116 కానుకగా ఇస్తానని వారు మాట ఇచ్చారు. దాని ప్రకారం ఇవాళ సంతోష్ నగర్‌కు చెందిన స్వాతి వివాహానికి దంపతులిద్దరూ హాజరై రూ.10,116 నగదును పెళ్లి కానుకగా ఇచ్చారు.