ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వాసులకు శుభవార్త. భద్రాచల సీతారామయ్య కళ్యాణ తలంబ్రాలను రూ.151లకే అందించనున్నట్లు టీఎస్ఆర్టీసీ ఎండీ వై.నాగిరెడ్డి తెలిపారు. హైదరాబాద్ బస్ భవన్లో శనివారం పోస్టర్ ఆవిష్కరించారు. తెలంగాణకు చెందినవారు ఈ నెల 23వ తేదీన www.tgartclogistics.co.inలో రిజిస్టర్ చేసుకోవాలని, శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అనంతరం తలంబ్రాలు అందజేస్తామని ఆయన వివరించారు.