TG: డీజీపీ శివధర్ ఎదుట 42 మంది మావోయిస్టులు.. ఆయుధాలతో సహా లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో పీఎల్జీఏ బెటాలియన్ సభ్యులతో సహా.. డిప్యూటీ కమాండర్ కేశాలు కూడా ఉన్నాడు. సుమారు 40 ఆయుధాలను పోలీసులకు అప్పగించారు. ఈ మావోయిస్టుల్లో ఎక్కువ మంది ఛత్తీస్‌గఢ్ క్యాడర్‌కు చెందిన వారు ఉండగా.. ఒక్కరు మాత్రమే తెలంగాణ వాసి ఉన్నారు.