నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్ దేవరకొండ సుజాత అశోక్, కమిషనర్ వై. ఓ నందలు ఇవాళ 45వ డివిజన్ సర్వేపల్లి కాలువ ప్రాంతంలో దోమల నివారణ చర్యలలో భాగంగా అత్యాధునిక డ్రోన్ల సహాయంతో మందు పిచికారి కార్యక్రమాన్ని ప్రారంభించారు. దోమల రహిత నెల్లూరు నగరాన్ని తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్ధమైన చర్యలు చేపడుతున్నామని మేయర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.