NLG: చిట్యాల పురపాలికలోని 10వ వార్డుకు చెందిన దాసరి పద్మ క్యాన్సర్తో మృతి చెందారు. మున్సిపల్ ఛైర్ పర్సన్ పందిరి గీత-రమేష్ మానవత్వం చాటుకున్నారు. నిరుపేద కుటుంబ పరిస్థితిని గమనించి, అంత్యక్రియల నిమిత్తం ఆదివారం రూ. 5,000లు తక్షణ సహాయాన్ని అందించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఆమె వెంట కౌన్సిలర్లు, నాయకులు ఉన్నారు.