పరిశ్రమలోకి అడుగుపెట్టినప్పుడు 50 ఏళ్ల నట ప్రయాణం ఉంటుందని ఊహించలేదని మోహన్ బాబు అన్నారు. తన యూనివర్సిటీ 34వ వార్షికోత్సవంలో ఆయన మాట్లాడుతూ.. 1975లో ‘స్వర్గం నరకం’తో మొదలైన తన కెరీర్లో ఇప్పటివరకు 560 సినిమాలు చేశానని తెలిపారు. తల్లిదండ్రుల దీవెనలు, ప్రేక్షకుల అభిమానం వల్లే ఈ స్థాయికి చేరుకున్నానని, నటుడిగా ప్రయాణం ఇంకా కొనసాగుతుందని పేర్కొన్నారు.