»Congress Special Focus On Telangana Revanths Strategy Is To Win Elections
Telangana: తెలంగాణపై కాంగ్రెస్ ప్రత్యేక ఫోకస్..ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా రేవంత్ వ్యూహం
కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణలో సరికొత్త వ్యూహ రచనతో ముందుకు సాగుతోంది. రేవంత్ రెడ్డి సారధ్యంలో రాష్ట్ర కాంగ్రెస్ కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రకటన చేసింది. 26 మందితో కూడిన ఈ కమిటీ గెలుపే లక్ష్యంగా పనిచేయనుంది.
తెలంగాణ(Telangana)లో పొలిటికల్ హీట్ ఎక్కువైంది. అన్ని పార్టీలు ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు(Elections) అన్ని పార్టీలు, ముఖ్య నేతలు ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. కేసీఆర్(KCR) సర్కార్‌ను గద్దె దించేందుకు అన్ని పార్టీలు అనేక ప్రయత్నాలు చేస్తున్నాయి. అందులో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ(Congress Party)లో రేవంత్ రెడ్డి(Revanth Reddy) సేన ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహ రచన చేస్తూ ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం కీలక ప్రకటన చేసింది.
తెలంగాణ ఎన్నికల కోసం కాంగ్రెస్ కమిటీ(Congress Committee)ని ఏర్పాటు చేస్తూ 26 మంది సభ్యులను ప్రకటించింది. కర్ణాటకలో కాంగ్రెస్ విజయం సాధించడంతో రాష్ట్ర నేతల్లో మరింత జోష్ పెరిగింది. ఈ తరుణంలో టీపీసీసీ చీఫ్ రేవంత్, సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క సహా 26 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసింది. ఇకపోతే ఈ కమిటీకి చైర్మన్‌గా రేవంత్ రెడ్డిని నియమిస్తూ కాంగ్రెస్ ప్రకటన చేసింది.
తెలంగాణ కాంగ్రెస్ కమిటీ(Telangana Congress Committee) ప్రతిపాదనకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా ఆమోదం తెలిపారు. ఈ కమిటీ తక్షణమే అమలులోకి వచ్చింది. కమిటీలో ఎక్స్ అఫిషియో మెంబర్స్‌గా యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అలాగే ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు, స్టేట్ సేవా దళ్ చీఫ్ ఆర్గనైజర్ వంటి పొజిషన్స్ ఉండనున్నాయి.