AP: ద్రోణి ప్రభావంతో ఇవాళ, రేపు ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని APSDMA తెలిపింది. అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వానలతో పాటు పిడుగులు పడతాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రజలు వర్షం పడే సమయంలో చెట్ల కింద ఉండరాదని హెచ్చరించింది. పిడుగుపట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది.