అనకాపల్లి జిల్లాలో ఈనెల 23 నుంచి ప్రారంభమయ్యే ఇంటర్మీడియట్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీఐఈఓ ఎం వినోద్ బాబు తెలిపారు. జిల్లాలో 34 కేంద్రాల్లో ప్రథమ ద్వితీయ సంవత్సరానికి చెందిన 26,301 విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు మౌలిక వసతి సదుపాయాలు కల్పించామన్నారు.