అభిషేక్ శర్మతో కలిసి ఓపెనింగ్ చేయడంపై సంజూ శాంసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పంజాబీ కుర్రాడు అభిషేక్ శర్మతో కలిసి తను బ్యాటింగ్కు దిగడం అంటే ‘అగ్గికి అగ్గి రాజుకున్నట్లే’ అని వ్యాఖ్యానించాడు. తమ స్నేహం కేరళ, పంజాబ్ సంస్కృతుల కలయికని అన్నాడు. అభిషేక్ ఆటతీరు జట్టుకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందని పేర్కొన్నాడు. బరిలోకి దిగితే పరుగుల వర్షం కురిపించడమే తమ లక్ష్యమని తెలిపాడు.