ఖమ్మం జిల్లా సివిల్ సప్లయిస్ అధికారి టౌన్లో హోటళ్ళు, రెస్టారెంట్లపై శనివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో పలు హోటళ్ళు, రెస్టారెంట్లలో డొమెస్టిక్ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్నట్లు గుర్తించారు. మొత్తం 20 డొమెస్టిక్ సిలిండర్లు స్వాధీనం చేసుకున్నారు. ఇది చట్టవిరుద్ధమని తెలిపారు. సిలిండర్లు సీజ్ చేసి కేసు నమోదు చేశారు.