JGL:పేదవారి సొంతింటి కల సాకారమే ప్రభుత్వ లక్ష్యమని వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. భీమారం మండలంలోని గోవిందారం గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారుల గృహప్రవేశానికి శనివారం హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంతో అనేక కుటుంబాలు సొంతింటి సంతోషాన్ని పొందుతున్నారన్నారు.