విశాఖలో తీవ్ర మెదడు వ్యాధితో బాధపడుతున్న 7 ఏళ్ల చిన్నారి జోయ మహమ్మద్ చికిత్సకు వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి రూ.2 లక్షల ఆర్థిక సహాయం అందించారు. ఆయన ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షుడు కేకే రాజు, దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ బాధిత కుటుంబానికి చెక్కు అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.