KRNL: కుటుంబ కలహాల కారణంగా మహిళ తన ఇద్దరు చిన్నారులతో కలిసి ఆత్మహత్యకు పాల్పడిన విషాద సంఘటన వెలుగు చూసింది. శనివారం ఈ ఘటన జిల్లాలోని గార్గేపురం చెరువులో జరిగినట్లు స్థానికులు తెలిపారు. వెంటనే వారు పోలీసులకు తెలపగా ఘటన స్థలం చేరుకుని మృతులు రాజేశ్వరి (35 ) తన ఇద్దరు చిన్నారులు అబ్రహం(3) సుకుమార్ (6)లుగా గుర్తించినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.