WG: బీజేపీ జిల్లా యువమోర్చా నూతన కమిటీని బీజేవైఎం జిల్లా అధ్యక్షులు పి.గోపాలకృష్ణ శనివారం ప్రకటించారు. ఈ కమిటీలో ఆచంట మండలం పెనుమంచిలికి చెందిన కాసుల సత్యసాయిను జనరల్ సెక్రటరీగా నియమించారు. గతంలో సత్యసాయి యువమోర్చా విభాగంలో పనిచేశారు. సత్యసాయిను ఆచంట మండలానికి చెందిన బీజేపీ నాయకులు, కార్యకర్తలు అభినందించారు.