ADB: ‘ఇన్నోవేషన్ పంచాయత్’ కార్యక్రమం విజయవంతమైందని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. శనివారం జరిగిన ఈ ప్రదర్శనలో ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల నుంచి 40 మందికి పైగా యువ ఆవిష్కర్తలు తమ వినూత్న ప్రాజెక్టులను ప్రదర్శించారు. అభివృద్ధి మెట్రో నగరాలకే పరిమితం కాకుండా, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు.