TG: దీపం పథకం కింద 28లక్షల మంది LPGని వినియోగిస్తున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ తెలిపారు. రాష్ట్రంలో 7.5 లక్షల మంది వాణిజ్య LPG సిలిండర్లు.. ప్రతి నెలా గృహ వినియోగదారులు 60 లక్షల సిలిండర్లు వాడుతున్నారని చెప్పారు. వాణిజ్య సిలిండర్ల కొరత ఉందని.. గృహ అవసరాలకు కావాల్సిన సిలిండర్ల కొరత లేదని స్పష్టం చేశారు. ప్రజలు భయపడి ముందుగానే ఎక్కువ బుకింగ్స్ చేస్తున్నారన్నారు.