HNK: ఆత్మకూరు మండలంలోని నాగయ్యపల్లి గ్రామాభివృద్ధికి సహకరిస్తానని కుడా ఛైర్మన్ ఇనగాల వెంకటరామిరెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన నాగయ్యపల్లి గ్రామ ఉప సర్పంచ్ కరుణాకర్, నేతలతో భేటీ అయ్యారు. గ్రామ అభివృద్ధి, ఇతర రాజకీయ అంశాలపై కాసేపు ఛైర్మన్‌తో వారు చర్చించారు. గ్రామాల సమగ్ర అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని ఛైర్మన్ తెలిపారు.