Gunturkaram Movie: గుంటూరు కారంలో కబడ్డీ సీక్వెన్స్..?
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం గుంటూరు కారం. ఈ మూవీ పై అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఆయన చివరగా నటించిన సర్కారువారి పాట బెడిసి కొట్టడంతో, గుంటూరు కారం హిట్ కావాలని ఎదురు చూస్తున్నారు. కానీ, ఈ మూవీ కూడా షూటింగ్ నేపథ్యంలో ఆలస్యమౌతూ వస్తోంది.
ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ‘గుంటూరుకారం’ సినిమా వచ్చే ఏడాది కి వాయిదా పడిపోయింది. అయితే, మూవీ ఆలస్యమైనా ఈ సినిమాలో ఫ్యాన్స్ ని సంతోషపెట్టే ఎలిమెంట్స్ ఇందులో చాలా ఉన్నాయి అని తెలుస్తోంది. ముఖ్యంగా ఇందులో త్రివిక్రమ్ మార్క్ కబడ్డీ సీన్స్ ఉంటాయని తెలుస్తోంది.
మహేష్ గతంలో ఒక్కడు సినిమాలో కబడ్డీ ఆడి అందరినీ ఆకట్టుకున్నాడు. ఆ సినిమాకి కబడ్డీ సీన్స్ చాలా హైలెట్ అని చెప్పాలి. ఆ మూవీకి గుణ శేఖర్ దర్శకత్వం వహించారు. మరి ఈ సారి త్రివిక్రమ్ కూడా గుంటూరు కారం కోసం మహేష్ తో కబడ్డీ ఆడించాలని డిసైడ్ అయ్యాడట. మరి ఈ ఆటను త్రివిక్రమ్ ఎలా ఆడిస్తాడో చూడాలి. ఈ విషయం బయటకు వచ్చినప్పటి నుంచి మూవీ పై ఎక్స్ పెక్టేషన్స్ మరింత పెరిగిపోయాయి.
కాగా, తొలి షెడ్యూల్ లోనే ఈ కబడ్డీ సీన్స్ తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఇంకా, ఈ మూవీలో యాక్షన్ సీన్స్ తెరకెక్కించాల్సి ఉందట. వాటి కోసం హైదరాబాద్ లోని పలు ప్రదేశాలను వెతుకుతున్నట్లు సమాచారం. మంచి లొకేషన్ దొరకగానే, యాక్షన్ సీన్స్ తెరకెక్కిస్తారట. ఇది పూర్తయితే, మూవీ దాదాపు పూర్తయినట్లే అని తెలుస్తోంది.