Ramadevi: చాలా మంది భక్తులలో ఒక అనుమానం ఉంటుంది. గుడికి వెళ్లి మనం తెచ్చుకున్న ప్రసాదమును అందరికీ పంచిపెట్టవచ్చా లేదా కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే స్వీకరించాలా లేదా ఎవరైతే ప్రసాదము తెచ్చుకుంటారో వారు మాత్రమే ఆరగించాలా అని. ఈ సమస్యలకు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త రామాదేవి చక్కటి సమాధానాలను ఇచ్చారు. దానిలో భాగంగా కొన్ని సార్లు మనం తీసుకొచ్చిన ప్రసాదమును మన ఇంట్లో వాళ్లు కూడా స్వీకరించరు. దాని అర్థం ఏంటంటే వారికి ఆ ప్రాప్తి లేనట్లు అని తెలిపారు. మరికొన్ని సందర్భాలలో ప్రత్యేక పూజలు చేస్తాము. ఆ సమయంలో చేసిన ప్రసాదంలో విషయంలో నియమాలు ఉన్నాయన్నారు. కొన్ని ప్రసాదాలు కేవలం ఇంట్లో కుటుంబికులు మాత్రమే తినాల్సినవి ఉంటాయి. మరికొన్ని ప్రసాదాలు చిన్నపిల్లలు మాత్రమే స్వీకరించాల్సివి, అలాగే కేవలం ముత్తైదులు మాత్రమే తినాల్సిన ప్రసాదాలు గురించి శాస్త్రంలో ఉంది అని చెప్పారు. ప్రసాదం విషయంలో మనం చేస్తున్న పొరపాట్లు ఏంటో, వాటిని ఎలా చక్కదిద్దుకోవాలో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడాల్సిందే.