WGL: హంటర్ రోడ్డులోని గోల్డెన్ గార్డెన్లో తూనికల కొలతల శాఖ ఆధ్వర్యంలో బంగారం, వెండి వ్యాపారులకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. అడిషనల్ కంట్రోలర్ రాజేశ్వరరావు మాట్లాడుతూ.. వ్యాపారాల్లో నాణ్యత పాటించాలని, తూకాల్లో మోసాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. వినియోగదారుల హక్కులు కాపాడేందుకు నిబంధనలు కచ్చితంగా పాటించాలని సూచించారు.