E.G: తూ.గో జిల్లాలో గృహ అవసరాల వినియోగం & అత్యవసర సేవల కోసం ఎల్పీజీ గ్యాస్ సరఫరా నిరంతరాయంగా కొనసాగుతోందని కలెక్టర్ కీర్తి చేకూరి శనివారం తెలిపారు. సంబంధిత ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు & గ్యాస్ పంపిణీదారులతో జిల్లా యంత్రాంగం నిరంతరం పర్యవేక్షణ జరుపుతుందన్నారు. జిల్లాలోని గ్యాస్ పంపిణీదారుల వద్ద సుమారు 17,360 సిలిండర్ల నిల్వ ఉందన్నారు.