నెల్లూరు: బుచ్చి పట్టణంలోని బెజవాడ బుజ్జమ్మ బాలికల ఉన్నత పాఠశాలలో మొత్తం 151 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయనున్నట్లు ప్రధాన ఉపాధ్యాయురాలు సుజాత తెలిపారు. ఈ మేరకు విద్యార్థులకు ఆమె పరీక్ష సామాగ్రి పంపిణీ చేశారు. విద్యార్థులు జిల్లా స్థాయిలో మంచి మార్కులు సాధించి పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.