VSP: జిల్లాలో పదో తరగతి వార్షిక పరీక్షల నిర్వహణకు విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా డీఈవో ప్రేమ్ కుమార్ తెలిపారు. మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు జరిగే పరీక్షలను 133 కేంద్రాల్లో 28,983 మంది విద్యార్థులు రాయనున్నారన్నారు. ప్రతిరోజూ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు పరీక్షలు జరుగుతాయని చెప్పారు.