KRNL: కౌతాళం సొసైటీ కార్యాలయంలో సహకార రాజీ పరిష్కార పథకం-2026 పై ఇవాళ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కర్నూలు కేడీసీసీ బ్యాంక్ సీఈవో కె. రామాంజనేయులు పాల్గొని పథకం ప్రయోజనాలను వివరించారు. సొసైటీలో ఖాతా ఉన్న, అర్హులైన రైతులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కౌతాళం సొసైటీ ఛైర్మన్ అల్లూరి వెంకటపతి రాజు తెలిపారు.