WG: గ్యాస్ కృత్రిమ కొరత సృష్టించి వ్యాపారులు వినియోగదారులను దోచుకుంటున్నారని సీపీఐ నేతలు ఎం. సీతారాం, మండల నాగేశ్వరరావు విమర్శించారు. శనివారం తాడేపల్లిగూడెం బస్టాండ్ సెంటర్లో నిరసన చేపట్టారు. ఒక్కో సిలిండర్‌కు రూ. 1500 నుంచి రూ.3,000 వరకు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. పెట్రోలు, డీజిల్, నిత్యావసర ధరలను నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు.