AP: చంద్రబాబు తన అనుభవాన్ని ఊరూరా తప్పుడు ప్రచారాన్ని చేయడానికే వినియోగిస్తున్నారంటూ YCP రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. ‘దేశంలో నాకంటే సీనియర్ లేడని చెప్పుకునే చంద్రబాబు.. అబద్ధాలపైనే బతకాల్సిన పరిస్థితి. ఆధారాలు లేకుండా తిరుపతి లడ్డూలో జంతు కొవ్వు అన్నాడు. సుప్రీంకోర్టు చెప్పినా ఇంకా అదే దుష్ప్రచారాన్ని చేస్తూనే ఉన్నాడు’ అని ఆరోపించారు.