సత్యసాయి: 10వ తరగతి పరీక్షల నేపథ్యంలో జిల్లాలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ సతీష్ కుమార్ శనివారం తెలిపారు. మార్చి 16 నుంచి 107 కేంద్రాల్లో పరీక్షలు ప్రారంభం కానున్నాయి. కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాసేలా చర్యలు తీసుకున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు.